● చిన్నమ్మడు అంత్యక్రియలు పూర్తి
● మహిళా న్యాయవాది, ఆమె కుటుంబ సభ్యుల నుంచే బంగారం రికవరీ
జలుమూరు: అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామంలో కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. కేసులో అనుమానితులుగా ఉన్న మహిళా న్యాయవాది, ఆమె సోదరుడు అచ్యుతరావు, ఆమె కుమారులు నుంచి సుమారు 18 తులాల వరకూ బంగారం రికవరీ చేశారు. ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన చిన్నమ్మడు హత్యకు గురై ఆనవాలు కూడా గుర్తుపట్టలేని విధంగా మూటలో కనిపించే సరికి గ్రామస్తులు గొల్లుమన్నారు. శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమార్టం అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అప్పజెప్పారు. అలాగే అనుమానితుల నుంచి బంగారం రికవరీ చేసి చిన్నమ్మడు కుమారులు శంకర్ నారాయణ, సు ధాకర్‌లకు అప్పజెప్పారు. ఇంతటి దారుణానికి ఒడికట్టిన న్యాయవాది తోపాటు ఆమెకు సహకరించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కుమారుడు సుధాకర్ కోరాడు. వృద్ధ మహిళ అని కనీసం చూడకుండా నమ్మకంగా ఇంటికి పిలిచి ఇలా చేయడం దారుణమని వాపోయాడు.


