‘తీర ప్రాంతంలో విధ్వంసకర తవ్వకాలు వద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘తీర ప్రాంతంలో విధ్వంసకర తవ్వకాలు వద్దు’

Aug 24 2026 1:19 AM | Updated on Aug 24 2026 1:19 AM

టెక్కలి: సముద్ర తీర ప్రాంతాల్లో విధ్వంసకరమైన రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ తవ్వకాలు చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు కోరారు. ఆది వారం టెక్కలిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ట్లాడారు. గార్నైట్‌, ఎలిమినైట్‌, జిర్కాన్‌, టైటానియం వంటి నిక్షేపాల కోసం సముద్ర తీర ప్రాంతాల్లో తవ్వకాలు చేయడానికి రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ ప్రాజెక్టు పేరుతో అదానీ సంస్థకు ఆదాయం సమకూర్చడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంద న్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ముఖ్యంగా సంతబొ మ్మాళి మండలంలో సుమారు 38 వేల ఎకరాల్లో బలవంతపు భూసేకరణ చేయడానికి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతు కుటుంబాలు నడిరోడ్డున పడతాయనే విషయం మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియదా అని ప్రశ్నించారు. సమావేశంలో ఎన్‌.షణ్ముఖరావు, కె.ఎల్లయ్య, హెచ్‌.ఈశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement