సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా విడుదల

Jul 4 2026 12:20 AM | Updated on Jul 4 2026 12:20 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను జిల్లా లో పక్కాగా పూర్తి చేసి సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 86.79 శాతం మ్యాపింగ్‌ పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం ఈ శని, ఆదివారాల్లో బీఎల్‌ఓలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లోనే అందుబాటులో ఉంటారని అన్నారు. అలాగే ప్రజలు ఓటర్స్‌.ఈసిఐ.గోవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ‘సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌’ లేదా ఈసేవ ద్వారా ‘బుక్‌ ఏ కాల్‌’ సౌక ర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు.

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత లేకుండా ముందస్తుగా 50 శాతం నిల్వలను సిద్ధం చేశామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాకు మొత్తం 37,707 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 17,000 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంచామని, 3,524 మెట్రిక్‌ టన్నుల డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఈసారి నల్లబజారును, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ’ఈ– పంట’ డేటాబేస్‌ ఆధారంగా, ’ఏపీ ఏమ్స్‌’, ’ఐఎఫ్‌ఎంఎస్‌’ యాప్‌ల ద్వారా పక్కాగా ఆధార్‌ అథెంటికేషన్‌, వేలిముద్రలు లేదా ఓటీపీ ఆధారంగానే ఎరువుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు.

శని, ఆదివారాల్లో పోలింగ్‌ కేంద్రాల్లోనే బీఎల్‌ఓలు

జిల్లాలో ఎరువుల కొరత లేదు

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement