శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు సిబ్బంది ఉద్యోగ రీత్యా లేదా కుటుంబ, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం డయల్ యువర్ ఎస్పీ (పోలీసు గ్రీవెన్సు) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యాలయంలో జిల్లాలో పలువురు పోలీసులు సెలవులు, సర్వీస్ అంశాలు, విధి నిర్వహణలో వచ్చే ఇబ్బందులను ఎస్పీకి తెలియజేశారు. పోలీసు సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల్లోగా 6309990800 నెంబరుకు ఫోన్ చేసి తెలియజేయవచ్చని ఎస్పీ తెలియజేశారు.
‘విచారణ ముగిసే వరకు ఎలాంటి ప్రచారాలు వద్దు’
రణస్థలం: తనపై పలు పత్రికల్లో వస్తున్న వార్తల్లో వాస్తవాలు లేవని పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి పి.అజయ్‌బాబు తెలిపారు. పైడిభీమవరం పంచాయతీకి చెందిన సాధా రణ నిధుల దుర్వినియోగం జరిగిందని, సంబంధించిన రికార్డులను తారుమారు చేసినట్లు శుక్రవారం పలు పత్రికల్లో కథనాలు ప్రచురి తం కావడంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పంచాయతీకి చెందిన నిధులపై విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని కోరారు. తన అనుమతి లేకుండా తన ఇంటిలో ఫొటో లు తీయడం సబబు కాదన్నారు. నిధుల దు ర్వినియోగంపై విచారణ పూర్తయ్యేంత వరకు ఎలాంటి కథనాలు ప్రచారం చేయవద్దని ఆ ప్రకటనలో కోరారు.
జిల్లా రిజిస్ట్రార్ ఆకస్మిక తనిఖీ
ఆమదాలవలస రూరల్: జిల్లా రిజిస్ట్రార్ బి.సంజీవయ్య శుక్రవారం ఆమదాలవలస సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమదాలవలస విచ్చేసిన ఆయన కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. కార్యాలయ పరిధిలో రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే విషయం స్థానిక సబ్ రిజిస్ట్రార్‌ను అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ల వల్ల ఇక్కడ నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందని విషయం కూడా పరిశీ లించారు. క్రయ, విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సబ్ రిజిస్టర్ రాఘుపాత్రుని జగదీశ్వరరావు, కూన శివరామక్రిష్ణ, స్థానిక సిబ్బంది సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
మావిగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి
● అమరావతి కేవలం అవినీతి కూపం
● కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన
ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: మావిగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, దేశంలోనే మావిగన్ అ త్యుత్తమ రాజధాని అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూ టీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ (మచిలీపట్నం,విజయవాడ,గుంటూరు) కారిడార్ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయమని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న అమరావతి టీడీపీ స్వప్రయోజనాలకు మాత్రమే ఉపకరిస్తుందని, దీని పేరుతో భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, అప్పులు చేస్తున్నారని మండి పడ్డారు. స్వల్ప పెట్టుబడితో అప్పులు లేకుండా మావిగన్‌ను రాష్ట్ర రాజధానిగా తీర్చి దిద్దవచ్చని అన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తన ఆలోచన విరమించుకోవాలని సూచించారు. అమరావ తి ప్రాజెక్టు ప్రజల సొమ్మును దోచుకోవడానికి, కాంట్రాక్టర్లుకు దోచి పెట్టడానికే తప్ప సామాన్యుడికి ఉపయోగపడేది కాదన్నారు. మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే మచిలీపట్నం పోర్టు ఉందని, గన్నవరం విమానాశ్రమం, జాతీయ రహదారులు, కృష్ణానది జలాలు వంటి సహజ వనరులు సిద్ధంగా ఉన్నాయన్నారు.


