● పాతపట్నం బీఎల్‌ఏల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు
కొత్తూరు: అర్హత గల ఓటర్లను కాపాడుకోవాలని, ‘సర్’ కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు అన్నారు. మండలంలోని గూనభద్ర ఆర్‌ఆర్ కాలనీ, కొత్తూరులో శుక్రవారం నిర్వహించిన సర్ కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఎ.హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్టీ జిల్లా టా స్క్‌ఫోర్స్ సభ్యుడు సందీప్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రెడ్డి శాంతి అధ్యక్షతన బీఎల్‌ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ పార్టీ మద్దతుదారుల ఓట్లను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేకతను పసిగట్టిన ప్రభుత్వం ఓట్లను తొలగించే కుట్ర పన్నుతుందని అడ్డుకోవాలని సూచించా రు. రాష్ట్రంలో ఉన్న 4.16 కోట్ల ఓటర్లలో సుమారు 70 లక్షల ఓట్లు మ్యాపింగ్ కానందున ఈ ఓట్లును సర్ నెపంతో కూటమి ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. అందులో భాగంగా పాతపట్నం నియోజవర్గంలో సుమారు 53 వేల ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు. ప్రతి ఓటు కీలకమని కృష్ణదాస్ అన్నారు. ఎలాంటి సందేహం ఉన్నా వార్ రూమ్‌కు తెలపాలని హర్షవర్ధన్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో పార్టీ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు సందీప్ రెడ్డి, ఎంపీపీలు సవర సావిత్రి, రెడ్డి జ్యోతి, జెడ్పీటీసీ సభ్యులు కామక భాగ్యవతి, బీసీ సెల్ రాష్ట్ర సంయక్త కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు గండివలస ఆనందరావు, విష్ణు, రామకృష్ణ, నియోజకవర్గం బూత్ కమిటీ ఇన్‌చార్జి సూర్యం, మండల ఇన్‌చార్జి పోలయ్య, పార్టీ జిల్లా నాయకులు ఏవీ సురేష్ , వైస్‌ఎంపీపీ ప్రదీప్ ఉదయ్ మాజీ సర్పంచ్ సాదుబాబు, బొమ్మాలి నగేష్‌లతో పాటు పలువురు పార్టీ నేతలు, బీఏల్‌ఏలు పాల్గొన్నారు.


