అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయానికి చెందిన భూములను ఇచ్చేసి.. ఆలయ పరిసరాల్లోని జిరాయితీ భూములను శాశ్వతంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ త్రినాథరావు అన్నారు. శుక్రవారం విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ సుజాత, స్థానిక ఆర్డీవో సాయి ప్రత్యూషలతో కలిసి ఆలయ పరిసరాల్లో ఓ పురాతన భవనాన్ని పరిశీలించారు. ఈ భవనానికి బదులుగా ఆలయానికి చెందిన ఓ విలువైన భూమిని ఇచ్చేయడమో లేదంటే...అందుకు సమాన పరిహార మొత్తాన్ని ఇచ్చేసేలా నిర్ణయాలను తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధికి కావాల్సిన భూముల వివరాలను, ప్రత్యామ్నయంగా చేపడుతున్న చర్యలను ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ నివేదించారు. వీరి వెంట ఏఈవో అప్పలనాయుడు, డీసీ కార్యాలయ సూపరింటెండెంట్ మంగిపూడి ప్రసాద్ తదితరులున్నారు.


