శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ బదిలీ

Jul 4 2026 12:20 AM | Updated on Jul 4 2026 12:20 AM

శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నగరపాలక సంస్థ కమిషనర్‌ హనుమంతు కూర్మారావును బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆయన్ను మాతృసంస్థకు రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కావలి మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రావణ్‌కుమార్‌ను శ్రీకాకుళం కమిషనర్‌గా నియమించింది. కాగా, కూర్మారావు బాధ్యతలు స్వీకరించిన 15 రోజుల్లోనే శ్రీకాకుళం నగరంలో ప్రబలిన డయేరియాకు బాధ్యుడిని చేస్తూ జిల్లా అధికారులు సస్పెండ్‌ చేశారు. ఓ నెల రోజుల తర్వాత దానిని రీవోక్‌ చేస్తూ తిరిగి శ్రీకాకుళం కమిషనర్‌గా నియమించారు. కూర్మారావు సస్పెండ్‌ అయిన సమయంలో నగరవాసులతో పాటు కార్యాలయ సిబ్బంది సైతం చాలా బాధపడ్డారు. అదే కార్యాలయ సిబ్బంది తాజాగా కూర్మారావుని మాతృశాఖకు బదిలీచేసినట్లు ప్రభుత్వం జీవో విడుదల చేయగానే బాణసంచా కాల్చడం చర్చనీయాంశమైంది.

కూర్మారావు

శ్రావణ్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement