విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు న్యాయం చేయాలి

Jul 4 2026 12:20 AM | Updated on Jul 4 2026 12:20 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఐ.ఎఫ్‌.టి.యు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.కృష్ణవేణి, ఐ.యన్‌.టి.యు.సి. నాయుకులు సనపల అన్నాజీరావు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలో అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద కేంద్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, గాయపడిన వారికి రూ.50 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్‌ పరం కాకుండా శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, మణికొండ ఆదినారాయణమూర్తి, ఎన్‌.వి.రమణ, ఎం.గోవర్దనరావు, మెడికల్‌ రిప్రజెంటివ్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వాసుదేవరావు, వివిధ సంఘాలు నాయకులు కొత్తకోట అప్పారావు, ఎల్‌.రామప్పడు, మన్యం రమణ, పి.జగ్గారావు, పి.జనార్ధనరావు, కె.వి.ఎల్‌.ఎస్‌. ఈశ్వరి, టి.ముత్యాలరావు, డి.కిరణ్‌, నవిర రామకృష్ణ, శివ, రామ్మోహన్‌, ఎస్‌. మల్లేశ్వరరావు, ఎస్‌.లక్ష్మి, పుణ్యవతి, ఎస్‌.అప్పలరాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement