యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు

Jul 4 2026 12:20 AM | Updated on Jul 4 2026 12:20 AM

జి.సిగడాం : ఖరీఫ్‌ సీజన్‌లో ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని కృషి విజ్ఞాశ్రీన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.అనూషా, రణస్థలం ఏడీఏ వడ్డాది శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జి.సిగడాం రైతుసేవా కేంద్రం వద్ద మొక్కజొన్న, వరిసాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడూ మొక్కజొన్న, వరి పంటలే కాకుండా వేరుశనగ, ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తే మంచి రాబడులు వస్తాయన్నారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటే పంటలపై మరింత అవగాహన కలుగుతుందన్నారు. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. అనంతరం చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన ఆదర్శ రైతులు డోల చిన్నంనాయుడు, బాతువ గ్రామానికి చెందిన కలిశెట్టి ఆదినారాయణలను అభినందించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బెండి బాబ్జీ, ఏఈఓలు మరడ వెంకటేష్‌, కొమ్ము అప్పారావు, కంబాల జగదేశ్వరరావు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు తిర్లంగి మాధవి, తలచింతల కుసుమ, మొయ్యిల సంతోష్‌, పట్నాన నర్సింగరావు, సనపల శివ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement