పరిమితికి మించి తవ్వవద్దు | - | Sakshi
Sakshi News home page

పరిమితికి మించి తవ్వవద్దు

Jul 3 2026 1:22 AM | Updated on Jul 3 2026 1:22 AM

నదిలో ఇసుకను పరిమితికి మించి తవ్వుతున్నారు. దీంతో సమీప పంట పొలాల్లో నీరు ఇంకిపోతున్నాయి. నదిలో 15 అడుగుల లోతులో పెద్ద గోతులు పెట్టి ఇసుకను తవ్వుతున్నారు. అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలపై పరిమితులు పెట్టాలి.

– జాయి వెంకటరమణ, బుచ్చిపేట

రోడ్లన్నీ పోయాయి

ఇసుక లారీల వల్ల మా రోడ్లన్నీ పాడైపోయాయి. నడవలేక పోతున్నాం. నదికి వెళ్లే ఒకే ఒక మార్గా న్ని ధ్వంసం చేశారు. రోడ్డును బాగు చేయాలి.

– కొన్న సూరన్నాయుడు, బుచ్చిపేట

మృతదేహం తీసుకెళ్లాలన్నా ఇబ్బందే

శ్మశాన స్థలం ఆక్రమించి పోగులు వేశారు. అంత్యక్రియలు చేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాం. స్కూల్‌ పిల్లలు ఇసుక లారీలతో అనేక అవస్థలు పడుతున్నారు. ఏ క్షణానికి ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయం కలుగుతుంది. గతంలో హాయిగా ఉండే వాళ్లం.

– మార్పు సురేష్‌, బుచ్చిపేట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement