రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ‘మావిగన్‌’ మూలం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ‘మావిగన్‌’ మూలం

Jul 3 2026 1:22 AM | Updated on Jul 3 2026 1:22 AM

మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

వజ్రపుకొత్తూరు రూరల్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్‌’ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మూలమని మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. వజ్రపుకొత్తూరులో గల వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం పార్టీ ముఖ్య నాయకులు, బీఎల్‌ఏలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సర్‌ పై బీఎల్‌ఏలకు దిశానిర్దేశంచేశారు.ఓటర్ల జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రయోజనం కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌ కోసం మాట్లాడారు. దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీని నేడు ఎన్‌సీఆర్‌(నేషనల్‌ క్యాపిటల్‌ రిజియన్‌)గా పిలుస్తున్నారని, ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న నోయిడా, గజియాబాద్‌, గుర్గామ్‌, ఫరీదాబాద్‌లకు అనుసంధానంగా సుమారు వెయ్యి కిలోమీటర్ల అవుటర్‌ రింగు రోడ్డు వేసి ఈ అనుసంధానంగా ఉన్న ఢిల్లీతో పాటు ఈ నాలుగు ప్రాంతాలను కలిపి ఎన్‌సీఆర్‌గా పిలుస్తున్నారని గుర్తు చేశారు. దేశ అభివృద్ధికి ఈ ఎన్‌సీఆర్‌ మూల స్తంభంగా ఉందని, అదే మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మావిగన్‌ పేరుతో కొత్త రాజధాని ఏర్పాటు చేస్తే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి, మావిగన్‌ల మధ్య వ్యత్యాసాన్ని జనాలకు వివరించాలని సూచించారు. వేలాది కోట్లు రాజధాని నిర్మాణం పేరిట వృధా చేస్తున్నారని, మావిగన్‌కు అంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. మావిగన్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పార్టీ శ్రేణులతో కలిసి తీర్మానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదయ్‌ కుమార్‌, పార్టీ మండల అధ్యక్షులు తిర్రి రాజారావు, మాజీ అధ్యక్షుడు పుక్కళ్ల గురయ్యనాయుడు, నియోజకవర్గ గ్రీవెన్స్‌ విభాగం అధ్యక్షుడు ఇరోతు హేమంత్‌, జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధన, కర్ని శ్రీను, మండల బూత్‌ కన్వీనర్‌ కరుణాకర్‌ ఉన్నారు.

107 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2358 పోలింగ్‌ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పో లింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణపై మాట్లాడా రు. ఇచ్ఛాపురంలో 20, పలాసలో 18, టెక్కలిలో 4, శ్రీకాకుళంలో 45, ఆమదాలవలసలో 11, ఎచ్చెర్లలో 9 చొప్పున కొత్త కేంద్రాలను ప్రతిపాదించగా, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు లేవన్నా రు. పలాస నియోజకవర్గంలో 7 పోలింగ్‌ స్టేషన్ల పేర్ల మార్పులతో పాటు ఇచ్ఛాపురంలో ఒకటి, పలాసలో ఒకటి, టెక్కలిలో రెండు, ఆమదాలవలసలో రెండు చొప్పున మొత్తం 6 చోట్ల మార్పులు ప్రతిపాదించామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement