శ్రీకాకుళం రూరల్ : వికసిత్ భారత్ జీ రామ్‌జీ పథ కం ద్వారా 125 రోజుల పనిదినాలను కల్పిస్తున్న ట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని గూడేం గ్రామంలో వీబీ జీ రామ్‌జీ పథకాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటివరకూ వంద రోజులు పని కల్పించారని, తాజాగా వీబీ జీ రామ్‌జీ ద్వారా అదనంగా మరో 25 రోజులు పని కల్పిస్తున్నట్లు తెలిపారు. జలధార జలహారతి కింద 90 రోజుల పాటు ఫీడర్ ఛానెల్లో పనులు, చెరువుల పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇకపై గ్రా మాల్లో రోడ్లు, కాలువలు, మరుగుదొడ్లు, అంగన్‌వా డీ, స్కూల్ పనులు చేసుకునేందుకు వెసులుబాటు ఉందన్నారు.కార్యక్రమంలో డ్వామా పీడీ లవరాజు, ఎంపీడీవోలు, ఏపీడీ, గ్రామస్తులు పాల్గొన్నారు.


