జాతీయ ఆర్చరీ పోటీల్లో సిక్కోలు హవా | - | Sakshi
Sakshi News home page

జాతీయ ఆర్చరీ పోటీల్లో సిక్కోలు హవా

Jul 3 2026 1:22 AM | Updated on Jul 3 2026 1:22 AM

జాతీయ ఆర్చరీ పోటీల్లో సిక్కోలు హవా

శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా ఆర్చరీ పోటీల్లో జిల్లాకు చెందిన ఆర్చరీ క్రీడాకారులు సత్తాచాటారు. గోవా వేదికగా జూన్‌ 26 నుంచి 29 వరకు ఆలిండి యా యూత్‌ స్పోర్ట్స్‌ అండ్‌ యాక్టివిటీస్‌ ఓపెన్‌ నేషనల్‌ ఆర్చరీ పోటీల్లో శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న ఫ్యూచర్‌ ఆర్చరీ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. అకాడమీ కోచ్‌ డొంక సంతోష్‌ సారథ్యంలో జి. జోష్య తులశ్రీ బంగారు పతకం, జె.రిషాన్‌ రజతం, కె.పూర్ణానంద బృందం రజతం, ఎ.దుష్యంత్‌ రజతం, కె.జక్షిత్‌ రామ్‌ కాంస్యం, బి.సమీర రాణి రజతం, ఎం.చరణ్‌ తేజ కాంస్యం, వి.ఎస్‌.భరత్‌ రజ తం, ఆర్‌.యశ్వంత్‌, పి.ఈక్షిత్‌ రామసాయి, వి.ఎస్‌.భరత్‌ టీమ్‌ బంగారు పతకాలు, బి. నిత్య బంగారం, జి.దేవరాజ్‌ రజత పతకాలు సాధించారు. వీరందరినీ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ గురువారం అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement