ఆర్‌ఓబీల ఏర్పాటుకు స్థల సేకరణ | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఓబీల ఏర్పాటుకు స్థల సేకరణ

Jul 3 2026 1:22 AM | Updated on Jul 3 2026 1:22 AM

ఆర్‌ఓబీల ఏర్పాటుకు స్థల సేకరణ రీ సర్వేకు సహకరించాలి ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతులు కల్వర్టును ఢీకొన్న కారు

పలాస: నీలావతి, సున్నాదేవి రైల్వే ఎల్‌.సి.గేట్లు వద్ద ఆర్‌ఓబీల కోసం స్థల సేకరణ జరుగుతోందని, ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులు సహ కరించాలని పలాస ఆర్డీవో ఆర్‌.అప్పలరాజు కోరారు. ఈ మేరకు బుధవారం రెవెన్యూ అధికారులు, రైల్వే సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి అభిప్రాయాలను సేకరించా రు. కార్యక్రమంలో తహశీల్దారు బి.శ్రీదేవి, రైల్వే లైజనింగ్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ రాజు,రైల్వే సెక్షన్‌ ఇంజినీరింగ్‌ సిబ్బంది, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

హిరమండలం: భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు. ఎల్‌ఎన్‌పేట మండలం గోలుకుప్ప గిరిజన గ్రామంలో రైతులు రీ సర్వే ను అడ్డుకోవడంతో గురువారం ఆర్డీవో కృష్ణమూర్తితో కలిసి పర్యటించారు. భూముల రీ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అయినప్పటికీ రైతు లు సంతృప్తి చెందకపోవడంతో రీ సర్వే జరిగే లా రైతులతో మాట్లాడాలని తహసీల్దార్‌ ఈశ్వ రమ్మను ఆదేశించారు. అనంతరం అగ్రహారంలో సర్‌ ప్రక్రి యను పరిశీలించారు. తురకపేట సెంటర్‌లోని ఎరువుల దుకాణం తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీటీ నీలిమ, సిబ్బంది పాల్గొన్నారు.

అరసవల్లి: జిల్లా పరిషత్‌ యాజమాన్య పరిధి లో సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఇద్దరికి ఏఓలుగా పదోన్నతులు కల్పిస్తూ జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, జెడ్పీ సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశా రు. నీలాద్రిరావుకు జి.సిగడాం మండల పరిష త్‌ కార్యాలయ ఏఓగా, వి.దేవిప్రసాద్‌కు మెళి యాపుట్టి మండల పరిషత్‌ కార్యాలయ ఏఓగా నియమించారు. కార్యక్రమంలో సి–సెక్షన్‌ ఏఓ రమేష్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

టెక్కలి రూరల్‌: బొప్పాయిపురంసమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఓ కారు అతివేగంగా వచ్చి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి పలా స వైపు వస్తుండగా ఇరుకు వంతెన వద్ద కారు ను అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారు లో ఉన్న జి.కమల, కె.విజయ, జి.అనూషలకు స్వల్పగాయాలు కాగా డైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.

టీడీపీకి ఇన్‌చార్జి కావాలా..? వద్దా..?

రణస్థలం: టీడీపీ ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఇన్‌చార్జి కావాలా.. వద్దా అంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, తణుకు ఎమ్మెల్యే, జోనల్‌ కో ఆర్డినేటర్‌ ఎ.రాధాకృష్ణ, పార్లమెంటరీ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున అభిప్రాయ సేకరణ చేసినట్లు టీడీపీ శ్రేణుల భోగట్టా. రణస్థలం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో టీడీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో నిర్వహించారు. సమావేశం అనంతరం ఒక గదిలో నియోజకవర్గ అభివృద్ధి, ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జి అవసరమా లేదా అని అభిప్రాయాలు తెలుసుకున్నారని సమాచారం. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని సంధ్య గజపతి, డీజీఎం ఆనందరావు, ముప్పిడి సురేష్‌, చౌదరి బాజ్జిలతో పాటు పలువురి పేర్లు ప్రధానంగా ఉన్నట్లు వినికిడి. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకే ఇన్‌చార్జి ఇస్తారనే గుసగుసలూ వినిపించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement