అరసవల్లి: జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తూ..వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాల్లో అర్హులకు గురువారం కారుణ్య నియా మాకాల్లో భాగంగా ఆఫీస్ సబార్డినేట్లుగా ఉద్యోగ నియామకపత్రాలను జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజ య అందజేశారు. జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దేవాది లక్ష్మణరావుకు జలుమూరు ఎంపీపీ కార్యాలయంలో, పట్ట రామినాయుడుకు సారవకోట ఎంపీపీ కార్యాలయంలో, వంగర లోకేష్‌కు జి.సిగడాం ఎంపీపీ కార్యాలయంలో, గొర్లె నిరోషకు బూర్జ ఎంపీపీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్లుగా నియమించారు. జిల్లా పరిష త్ యాజమాన్యంలో ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తు న్న ఎస్.ప్రణీత్‌కుమార్‌కు సింగుపురం జెడ్పీ హైస్కూల్‌లో, జి.శ్రీనివాసరావుకు బొద్దాం జెడ్పీ హైస్కూల్‌లో, ఇ.రాజశేఖర్‌కు ఆదపాక జెడ్పీ హైస్కూల్‌లో రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. కార్యక్రమంలో సి–సెక్షన్ ఏఓ ఉరిటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయినా ఇంత వరకు తమ కుమార్తెలిద్దరికి పీడీఎఫ్ పరిహారం చెల్లించలేదని తండ్రి గిన్ని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ తన కుమార్తెలు గిన్ని నోమేశ్వరి, గిన్న జ్యోతిలకు పరిహారం చెల్లించలేదన్నారు. ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్, ఆర్‌డీవో, తహసీల్దార్‌ల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదన్నారు. టీడీపీ కార్యకర్త అయిన తాను గత ప్రభుత్వం హయాంలో పోర్టు భూములు ఇవ్వడానికి అప్పట్లో అంగీకరించలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక భూములు ఇచ్చేందుకు సిద్ధపడి సంతకం చేశానన్నారు. అయినా పరిహారం ఇవ్వకుండా జాప్యం చేయడం తగదన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, పీఆర్‌సీ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన వంటివి వెంటనే చేపట్టాలని ఎన్జీవో సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశా రు. గురువారం కలెక్టరేట్ వీసీ హాలులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ రంగ సమస్యలపై ప్రస్తావించారు. కార్యక్రమంలో ఎపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు, జేఏసీ అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, కోశా ధికారి బడగల పూర్ణచంద్రరావు,పూజారిజానకిరాం, డి.శ్రీరామ్, బొచ్చ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
11న జాతీయ లోక్ అదాలత్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రాజీకి అనువైన కేసులను పరిష్కరించుకుని దీర్ఘకాలిక న్యాయపోరాటాలకు ముగింపు పలకాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు విజ్ఞప్తి చేశారు. కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన వివాదాలను పరస్పర రాజీ మార్గంలో, తక్కువ సమయంలో పరిష్కరించుకునేందుకు శాశ్వత లోక్ అదాలత్ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మ న్ జి.రజిని పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని సంస్థ ప్రాంగణంలో వివి ధ శాఖల అధికారులతో వారు అవగాహన కార్య క్రమం నిర్వహించారు. రవాణా, పోస్టల్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆస్పత్రి, బీమా, బ్యాంకింగ్, గ్యాస్ సరఫరా వంటి ప్రజా ప్రయోజన సేవల వివాదాలను ఈ అదాలత్ ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.


