పాతపట్నం: విద్యా సంవత్సరం ప్రారంభమై రోజు లు గడుస్తున్నా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంత వరకు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు అందించకపోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని, కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను గాలికొదిలేసిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. గురువారం పాతపట్నంలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, మండ ల కన్వీనర్లు, బీఎల్‌ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా జరుగుతున్న ఓటర్ల సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావే శంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ చింతాడ సూర్యనారాయణ, రాష్ట్ర బూత్ కమిటీ అధ్యక్షుడు రెడ్డి రామారావు, రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ విభాగం జాయింట్ సెక్రటరీ ఇప్పిలి నారాయణరావు, నియోజకవర్గ బూత్ అధ్యక్షుడు ఏనుగుతల సూర్యం, బైపోతు ఉదయ్‌కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ సవర రమేష్, మండల పార్టీ అధ్యక్షులు గండివలస ఆనందరావు, మీసాల వెంక ట రామకృష్ణ, పెనుమజ్జి విష్ణుమూర్తి, బూత్ కమిటీ అధ్యక్షులు గోకవలస రాము, రవి, సాధుబాబు, ప్రసాదరావు, చిన్నారావులు, మామిడి గంగధర్, రాజు తదితరులు పాల్గొన్నారు.


