కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

Jul 3 2026 1:22 AM | Updated on Jul 3 2026 1:22 AM

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): వివిధ షెడ్యూల్‌ పరిశ్రమల కార్మికులు, అంగన్‌వాడీ, ఆశా, వి.ఓ.ఎ, మధ్యాహ్న భోజనం పథకం తదితర స్కీం వర్కర్లు, కాంట్రాక్టు – అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగులకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరు తూ జూలై 30, 31 తేదీలలో కలెక్టర్‌ కార్యాలయాల వద్ద చేపట్టనున్న ధర్నాలు విజయవంతం చేయాల ని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సి.హెచ్‌.అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ కె.నాగమణి పిలుపునిచ్చా రు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్‌ జిల్లా భవన్‌లో సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం గురువా రం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగులు అతి తక్కువ వేతనాల తో తీవ్ర శ్రమదోపిడీకి గురవుతున్నారని చెప్పారు. ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వేతన సవరణ తప్పక జరగాలన్నారు. పరిశ్రమల్లో బలవంతంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనా రాయణ, ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్‌.గణపతి, ఎన్‌.వి.రమణ, హెచ్‌.ఈశ్వరరావు, డి.సుధ, డి.ధన లక్ష్మి, బి.ఉత్తర, కె.కేశవరావు, కె.సుశీల, ఎన్‌.మోహనరావు, ఆర్‌.చంద్రమౌళి, అంబటి సత్యనారాయ ణ, హేమలత, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement