హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండంలో ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. చివరకు బస్ సెల్టర్ నిర్మాణం కోసం కూటాయించిన స్థలా న్ని సైతం విడిచిపెట్టడం లేదు. అలికాం–బత్తిలి ప్రధాన రహదారి చెంతనే న్యూగొట్టా బ్యారేజీ సెంటర్‌లో బస్టాండ్ లేకపోవడంతో షెల్టర్ నిర్మాణానికి స్థలం కేలాయించారు. 2022లో ప్రస్తుత కేంద్ర మంత్రి, నాటి ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు శంకుస్థాపన చేశారు. కానీ ఎందుకో బస్టాండ్ నిర్మా ణం జరగలేదు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సదరు స్థలంలో నిర్మాణం మొదలుపెట్టాడు. ఇప్పటికి పునాదుల స్థాయిలో నిర్మాణాలు పూర్తయినా అధికారులు పట్టించుకోలేదు. స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదు లు చేయడంతో తహశీల్దారు బాలకృష్ణ స్పందించా రు. ఆర్‌ఐ ,వీఆర్వోలను పంపించి పనులను నిలిపివేశారు. అక్కడ వీలైనంత త్వరగా బస్టాండ్ నిర్మా ణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


