● ఎరువుల కోసం పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

● ఎరువుల కోసం పడిగాపులు

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

– ఆమదాలవలస

రైతులకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. ఆమదాలవలస పట్టణంలో ఎరువుల దుకా ణాల నుంచి ప్రభుత్వం అందించే యాప్‌ ద్వారా రైతు లకు ఎకరాకు ఒక బస్తా చొప్పున యూరియా అందిస్తున్నారు. పట్టణంలోని 4 దుకాణాలకు వ్యవసాయశాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. అధిక ధరలకు అమ్మకూడదని, పురుగు మందులు కూడా కొనాలని ఒత్తిడి చేయకూడదని ఆదేశించారు. అయితే ఈ నిబంధనలు అమలు కావడం లేదని రైతులు చెబుతున్నారు. యూరియా బస్తాలు కూడా సకాలంలో అందడం లేదని, మూడు రోజులుగా దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో రైతుభరోసా కేంద్రాల వద్ద సలువుగా ఎరువులు అందేవని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement