పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో చాలావార్డుల్లో సురక్షిత తాగునీరు అందడం లేదు. 31 వార్డులకు గాను 24 వేల వీధి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. హడ్కోకాలనీ, రాజమ్మకాలనీ, సూదికొండకాలనీ తదితర ప్రాంతాల్లో తాగునీటికి నేటికి ట్యాంకర్లే ఆధారం. కొన్ని వార్డులకు ఉద్దానం రక్షిత మంచినీటి పథకం పైపుల ద్వారా, పైలెట్ స్కీమ్‌ల ద్వారా మంచినీరు సరఫరా అవుతున్నప్పటికీ ఆ పైపులైన్లు మురుగు కాలువలను ఆనుకుని ఉన్నాయి. కొన్నిసార్లు లీకేజీ కారణంగా మంచినీరు, మురుగునీరు కలిసిపోయి నీరు కలుషితమవుతోంది. సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.


