11, 12 తేదీల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

11, 12 తేదీల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న జిల్లాస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి, మీట్‌ స్పాన్సర్‌ నారాయణశెట్టి వెంకట కిరణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. పోటీలు జరగనున్న శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియం వేదికగా బుధవారం టోర్నమెంట్‌ బ్రోచర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్‌, సీఈఓ సంపతిరావు సూరిబాబు మాట్లాడుతూ అండర్‌–11, 13, 15, 17, 19 విభాగాల్లో బాల, బాలికలకు పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, ఈ నెల 9లోగా 9440255255, 8328514385 నంబర్లకు ఫోన్‌చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్‌ సంఘ జిల్లా కోశాధికారి, పీపీ గోర అనిల్‌కుమార్‌, గురుగుబెల్లి ప్రసాద్‌, మదీనా శైలానీ, మెండ శాంతికుమార్‌, కంచరాన వైకుంఠరావు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

మావిగన్‌కే ప్రజల మద్దతు

మందస: మావిగన్‌తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. మందస మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఎల్‌ఏల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మావిగన్‌కు పలాస నియోజకవర్గం నుంచి ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కూటమి పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అమరావతి పేరుతో రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు.

రాష్ట్ర విజిలెన్స్‌ కమిటీ

సభ్యుడిగా బగాది

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్‌, సీనియర్‌ న్యాయవాది బగాది రామమోహనరావును రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని నమోదిత వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల విభాగం ప్రతినిధిగా ప్రభుత్వం నామినేట్‌ చేసింది. ఈ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

క్రమశిక్షణతో చదవండి

ఎచ్చెర్ల : క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, నైపుణ్య ఆధారిత విద్యపై దృష్టి సారించాలని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ గిరిధర్‌ మద్రాస్‌ అన్నారు. బుధవారం వర్సిటీలో విద్యార్థులకు బ్రాంచిల వారీగా ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారేనని, పట్టుదలతో చదివి మంచి ఇంజినీర్లు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి శివరామకృష్ణ, డీన్‌ శాస్త్రి, ఫైనాన్స్‌ అధికారి వాసు, సాగర్‌, ప్రకాశరావు, యోగీశ్వరరావు, ముని రామకృష్ణ, మోహనకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement