● పొందూరు విద్యార్థికి రాష్ట్రస్థాయిలో
2వ ర్యాంకు
● ఇంజినీరింగ్‌లో 4722 మంది, అగ్రికల్చర్, ఫార్మసీలో 2198 మంది అర్హత
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాల్లో మెరుగైన ర్యాంకులు సాధించారు. పొందూరుకు చెందిన కోరుకొండ శ్రావ్య ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకుతో మెరిసింది. మెళియాపుట్టి మండలం మాకన్నపళ్లికి చెందిన తండ్యాల మురళి 71వ ర్యాంకు సాధించాడు. ఇంజినీరింగ్ విభాగంలో 6557 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 4722 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 2446 మంది పరీక్ష రాయగా 2198 మంది అర్హత సాధించారు.
అదరగొట్టారు..
నరసన్నపేటకు చెందిన తండ్యాల పవన్‌సాయి 106వ ర్యాంకు, సంతబొమ్మాళి మండలం కళింగ వీధికి చెందిన అల్లు రోహిత్ 110, శ్రీకాకుళం నగరానికి చెందిన నక్క పవన్ 161, రాజాంలోని కస్పా వీధికి చెందిన వడ్డాది చరణ్ 180వ ర్యాంకు సాధించారు. జిల్లాకు చెందిన పెద్దింటి మాధవ్ 246వ ర్యాంకు, ఎండ నవదీప్ 251, పైడి దినేష్ 323, వరుణీష్ మహాపాత్ర జామి 347, బొడ్డేపల్లి మనోజ్ 363, శ్రీకర్ కణితి 372, గురువు హైందవి 374, కొండల కనిష్క 417, సకలాబత్తుల యశ్వంత్ 465, బి.కౌషిత 521, ఎస్.కళ్యాణ్‌క్రాంతి 596, ఎన్.అరుణ్‌రాజ్ 597, నరవ రోషన్‌రామ్ 602, ఎం.జ్యోతీష్‌కుమార్ 630, పి.సాయిగౌతమ్ 648, నల్ల చరణ్ 677, పి.లక్ష్మీప్రణీత 699, జి.రుషిత 723, ఎం.హరినాక్ష్ 735, కంచరాపు రేవంత్‌కుమార్ 766, పి.లహరి 785, కె.లక్ష్మికౌషిక్ 786, వడ్డి మురళికృష్ణ 871, అన్నెపు నితిన్ 936, ఎన్.లావణ్య 952, జరుగుళ్ల లక్ష్మిసంజయ్ 985వ ర్యాంకులు సాధించారు. వీరంతా నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్ధులు కావడం విశేషం.


