● పొందూరు రైల్వేస్టేషన్‌లో హై టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

● పొందూరు రైల్వేస్టేషన్‌లో హై టెన్షన్‌

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

తెగిపడిన రైల్వే లైన్‌ హైటెన్షన్‌ వైర్‌

జిల్లాలో పలు స్టేషనల్లో రైళ్ల నిలిపివేత

పొందూరు రైల్వేస్టేషన్‌లో బుధవారం పెను ప్రమాదం తప్పింది. రెండో నంబర్‌ ప్లాట్‌ఫారం వద్ద రైళ్ల రాకపోకలకు సంబంధించిన ప్రధాన ఓవర్‌ హెడ్‌ హై టెన్షన్‌ విద్యుత్‌ వైర్లు ఒక్కసారిగా తెగిపడి భువనేశ్వర్‌–విశాఖపట్నం మార్గంలోని రైల్వే ట్రాక్‌పై పడిపోయాయి. ఈ సమయంలో ప్లాట్‌ఫారంపై ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానిక రైల్వే అధికారులు వెంటనే స్పందించి సాంకేతిక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అప్రమత్తమై విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. యుద్ధ ప్రాతిపదికన వైర్లకు మరమ్మతులు చేసి లైన్‌ క్లియర్‌ చేశారు. ఈ క్రమంలో భువనేశ్వర్‌–విశాఖపట్నం మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలాస ఈఎంయూతో పాటు పలు రైళ్లను ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లోనే నిలిపివేశారు. జి.సిగడాం, చీపురుపల్లి రైల్వే స్టేషన్ల వద్ద కూడా పలు రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. –పొందూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement