ఉపాధి పథకం పేరు మార్పు దారుణం
శ్రీకాకుళం అర్బన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీబీజీ రామ్‌జీగా మార్చడం దారుణమని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ధ్వజమెత్తారు. ఏఐసీసీ, పీసీసీ పిలుపుమేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద పార్టీ జిల్లా ఇన్‌చార్జి గాదం వెంకట త్రినాథరావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ పేదలు ఉపాధికి దూరమయ్యేలా చట్టంలో మార్పులు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో ఆలిండియా కాంగ్రెస్ ఓబీసీ కన్వీనర్ డాక్టర్ జీవితేశ్వరరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్‌కుమార్, నాయకులు మంత్రి నరసింహమూర్తి, కరిమజ్జి మల్లేశ్వరరావు, మాసుపత్రి చక్రవర్తిరెడ్డి, మామిడి సత్యనారాయణ, ఆబోతుల వెంకట నాయుడు, మజ్జి మురళీమోహన్, ఇజ్జురోతు రమణ, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు చాన్ బాషా, సీఐటీయూ నేత తిరుపతి, సీపీఎం నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, ఉపాధి వేతనదారులు పాల్గొన్నారు.


