పారదర్శకంగా విచారణ చేపట్టాలి
శ్రీకాకుళం కల్చరల్: డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, జిల్లా క్రైస్తవ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు నగరంలోని బాలికల హైస్కూల్ ఎదురుగా ఉన్న క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ నుంచి కొన్నావీధిలో ఉన్న కీస్టోన్ చర్చి వరకు శాంతియుత ర్యాలీ ఆదివారం చేపట్టారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రవీణ్ ప్రగడాలది ప్రమాదం కాదని, ఎవరో హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ డీఎస్‌వీఎస్ కుమార్, ఎస్‌ఎంయూపీఎఫ్ ప్రెసిడెంట్ రెవ.జాన్ జీవన్, సెక్రటరీ సీహెచ్ ప్రేమన్న, బిషప్ సామ్యూల్ మొజెస్, రెవ.పి.ఎస్.స్వామి, బిషప్ బి.బర్నబస్ తదితరులు పాల్గొన్నారు.


