ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో శ్రీకాంత్ శిష్య బృందం నాట్య ప
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొత్తం నాలుగు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయనుండగా, ఇందులో రికార్డు అసిస్టెంట్ విభాగంలో రెండు (ఓసీ–1, ఎస్సీ– 1), మిగిలిన రెండు విభాగాల్లో ఒక్కోటి చొప్పు న (ఓసీ) ఖాళీలు ఉన్నాయి. ఎంపికై న వారికి పోస్టును బట్టి నెలకు రూ.23,120 నుంచి రూ.89,720 వరకు వేతన శ్రేణి వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన ఫారమ్‌లను ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను కేవలం రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే ‘చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, శ్రీకాకుళం’ చిరునామాకు పంపాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్హతలు, వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌ను http:srikakulam.ecourts. gov.in సంప్రదించాలి. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ ఈ నెల 27 అని పేర్కొన్నారు.
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో శ్రీకాంత్ శిష్య బృందం నాట్య ప


