ఇక లేనట్లేనా!
నియోజకవర్గ స్థాయిలోని వ్యవసాయ ప్రయోగశాలలకు తాళం రెండు నెలలుగా కార్యకలాపాలు నిలిపివేత నాణ్యత, నకిలీ విత్తన పరీక్షలకు ఇక్కట్లు
పరిశీలిస్తాం..
తాతాలికంగా నిలుపుదల
జిల్లాలో ఇదీ పరిస్థితి..
సరికాదు..
రణస్థలం:
వ్యవసాయ ఉత్పాదకాలైన ఎరువులు, పురుగు మందులను రైతులు వినియోగించేందుకు ముందుగానే పరీక్షించి సరఫరా చేసేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్(వ్యవసాయ ప్రయోగశాలలు) సిద్ధం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వీటిని ఏర్పాటు చేశారు. ఇందులో పరీక్షించిన తర్వాత విత్తనాలు, పురుగుమందులను రైతు సేవా కేంద్రాల ద్వారా అన్నదాతలకు అందించే ప్రక్రియను విజయవంతంగా నడిపారు. నకిలీలు, నాణ్యత లేనివి, కాలం చెల్లినవి రైతుకు చేరకుండా ఈ ప్రయోగశాలలు ఎంతగానో దోహదపడేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. ల్యాబ్‌లను నిలిపివేసేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రెండు నెలలుగా కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ చర్యపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యతకు తిలోదకాలు
విత్తనం బాగుంటేనే పంట బాగా పండుతుంది. పంట కళకళలాడితేనే దిగుబడులకు దిగులుండదు. దిగుబడి, ధరలు బాగుంటేనే రైతన్నలకు తిరుగుండదు. అంతా సవ్యంగా జరగాలంటే మేలి రకం విత్తనం కావాలి. ఇలా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే జగనన్న అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేసి రైతన్నకు భరోసా కల్పించారు.
గతంలో వేగంగా పరీక్ష నివేదికలు
నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్‌లో నెలకు 447 శాంపిల్స్‌ను విత్తనాలు, ఎరువులు 73 శాంపిల్స్ సేకరించే వారు. ఎరువులతో పాటు పురుగు మందులు పరీక్షించేవారు. విత్తన పరీక్ష నివేదికను వారం రోజుల్లో అందించేవారు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్థారణ రిపోర్టు మూడు రోజుల్లోనే అందుకునేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పరీక్షలు జిల్లా కేంద్రంలోనే చేపట్టాల్సి ఉంది. ఇదంతా ప్రస్తుత సమయంలో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఇకపై పరీక్షలు నిర్వహించాలంటే రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరించి జిల్లా కేంద్రాలకు పంపిస్తే అవి చేరేదెప్పుడు, తిరిగి రైతులకు పరీక్షల నివేదిక అందేదెప్పుడని రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు.
ఇంటిగ్రెటెడ్ ల్యాబ్స్ నిలిపేశారని విషయం నాకు తెలియదు. అటువంటిదేమి ఉండదని అనుకుంటున్నాను. ప్రస్తుతం సిబ్బంది ఉన్నా రు. పూర్తిగా పరిశీలించి తెలుసుకుంటాం.
– కె.త్రినాథరావు, జిల్లా వ్యవసాయ అధికారి
జిల్లా కేంద్రంలో ఇంటిగ్రెటెడ్ ల్యాబ్‌కు అనుసంధానం చేస్తామని రెండు నెలలుగా కార్యాకలాపాలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ప్రస్తుతానికి పరికరాలు అలాగే ఉన్నాయి. ఖరీఫ్ వరకు విత్తనాలు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుత రబీ సీజన్‌కు రాలేదు.
– వి.సత్యనారాయణ, వ్యవసాయశాఖ ఏడీఏ, రణస్థలం
జిల్లాలో మొత్తం ఉడె ఇంటిగ్రెటెడ్ ల్యాబ్స్ ఉ న్నాయి. ఎచ్చెర్ల(రణస్థలం), ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్చాపురం, కొత్తూరు నియోజకవర్గ కేంద్రాల్లోని నియోజక వర్గానికి ఒకటి చొప్పున గత ప్రభుత్వం ఏర్పా టు చేసింది. ఇందులో ప్రస్తుతం ఏడు నియోజకవర్గాల్లో ల్యాబ్స్ మూతపడ్డాయి.
విత్తనాలు, పురుగు మందులను పకీక్షించి తదు పరి రైతుల పంట దిగుబడులకు ఉపయోగపడే నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను నిలుపుదల చేసి, జిల్లా కేంద్రానికి తరలించడం సరికా దు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మంచిని చెరిపేసే కుట్ర కూటమి ప్రభుత్వంలో జరుగుతోంది.
– గొర్లె కిరణ్‌కుమార్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే


