5 రోజులు.. రూ.15.76 కోట్లు
● సంక్రాంతికి ఏరులైపారిన మద్యం ● ఇబ్బడిముబ్బడిగా విక్రయాలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో శనివారం కూడా మందుబాబులు పండగ చేసుకున్నారు. ఎకై ్సజ్ అధికారుల సమాచారం మేరకు ఏకంగా రూ. 2.75 కోట్ల మద్యం లైసెన్సు దుకాణాలు, బార్లలో అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. పలు దుకాణాల్లో సాంకేతికలోపం కారణంగా స్కానింగ్ జరగకుండానే అమ్మకాలు సాగడంతో సుమారు రూ. 3.25 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే పండగ 5 రోజుల్లో ఏకంగా రూ.15.76 కోట్ల మద్యాన్ని మందుబాబులు గుటుక్కుమనిపించారు. శనివారం తొ మ్మిదిన్నర కోట్ల మద్యం డిపో నుంచి వెళ్లింది. నేడు ఆదివారం కావడంతో మరింత మద్యం అమ్ముడుపోయే అవకాశముందని అంచనా.


