సంక్రాంతి పండగకు తమ సొంత గ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప
చేనేతకు అందని ప్రభుత్వం సాయం కునారిల్లుతున్న చేనేత పరిశ్రమ గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం కింద ఏటా రూ.24 వేల చొప్పున సాయం రూపాయి విదల్చని చంద్రబాబు సర్కారు
అండగా ఉంటామని..
బాబూ.. ఆదుకోండి
నేతన్నలకు ప్రస్తుతం పూట గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు.
వస్త్రాల నేత కూడా గిట్టుబాటు కావడం లేదు. గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన విధంగా నెలకు రూ.2 వేలు చొప్పున, ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం అందజేసి, చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత కార్మికులు కోరుకుంటున్నారు.
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న
ఐజీ గోపీనాథ్ జెట్టి
శ్రీకాకుళం క్రైమ్ : అరసవల్లిలో రథసప్తమి వేడుకల ను సురక్షితంగా, సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ విస్తృత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టిందని విశాఖపట్నం రేంజి ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. శనివారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, డీఎస్పీలు, సీఐలతో అత్యవసర సమీక్ష సమావేశాన్ని డీఐజీ నిర్వహించారు. రూట్‌మ్యాప్‌లు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, క్యూల నిర్వహణ, ఉచిత, డోనర్ దర్శనం (రూ. 100, రూ. 500), వీఐ పీ దర్శనమార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులు తదితర అంశాలపై సమగ్రంగా సమీ క్షించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ ఇతర శాఖల సమన్వయంతో పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని తెలిపా రు. సామాన్య భక్తులు మరింత వేగంగా, సులువుగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖతో పాటు రెవెన్యూ, ఆలయ, వైద్య, మున్సిపల్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని, భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
నేటి నుంచి డోనర్ పాస్‌లు
అరసవల్లి: రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి దాతలకు ప్రత్యేకంగా పాస్‌ల పంపిణీ కార్యక్రమా న్ని ఈ నెల 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ చీఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ తెలియజేశారు. అలాగే వీఐపీ పాస్‌లను రూ.300లు చొప్పు న కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఈనెల 19 నుంచి వీఐపీ పాస్‌ల కోసం జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికార సిఫా ర్సు లేఖలతో పాటు శ్రీకాకుళం ఆర్డీవో కార్యాలయం నుంచి ఆమోదపు లేఖల ద్వారా అరసవల్లి సమీప బ్యాంకుల్లో వీఐపీ పాస్‌లు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
పాతపట్నం:
నేతన్నలకు కష్టకాలం దాపురించింది. ప్రభుత్వం నుంచి కనీస సాయం అందక చేనేత కళాకారులు విలవిలలాడిపోతున్నారు. కొన్ని కుటుంబాలకు పూట గడవడమే గగనంగా మారింది. పస్తులతో కాలం వెళ్లదీస్తున్నా వారి గురించి కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. మరోవైపు అప్పులు చేసి చేనేత సంఘాలు నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పరిశ్రమ చిక్కుల్లో పడింది. పలు సంఘాలు మూత దిశగా పయనిస్తున్నాయి. చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎన్‌టీ రామారావు హయాంలోని చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తామని, చేనేత ఉత్పత్తులపై 90 శాతం రిబేటు ఇస్తామంటూ 2024 ఎన్నికల ముందు హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. కూటమి ప్రభు త్వం వచ్చిన 18 నెలలకే చేనేత కార్మికులు మగ్గం విడిచి వ్యవసాయ కూలి పనులు, భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు.
చేనేత రంగానికి గత సీఎం జగనన్న అండగా నిలి చారన్నది నేతన్నల మాట. సొంత మగ్గం ఉన్న నేత కార్మికుల కుటుంబాలకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద నెలకు రూ.2 వేల చొప్పున ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఐదేళ్లలో సరాసరి జిల్లాలో 913 చేనేత కుటుంబాలకు రూ.8 కోట్ల సాయం అందజేసి ఆదుకున్నారు. అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు అమ్మఒడి, చేయూత, పింఛన్, వాహనమిత్ర, ఆరోగ్యశ్రీ తదితర పథకాలతో ఆర్థిక భరోసా కల్పించారు. ఇల్లు లేని కుటుంబాలకు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.1.80లక్షల చొప్పున ఆర్థిక సాయం అంద జేశారు. ఉచితంగా ఇసుక సరఫరాతోపాటు రాయితీపై నిర్మాణ సామగ్రిని సమకూర్చి ఇంటి భాగ్యం కల్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేనేత సంఘాల రుణాల మాఫీతో పాటు పావలా వడ్డీకే రుణ సదుపాయం, కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్, వస్త్రాలకు గిట్టుబాటు ధర కల్పిస్తే.. తండ్రి బాటలోనే జగన్ మోహన్‌రెడ్డి కూడా నేతన్నకు అండగా నిచిచారు.
చంద్రబాబు మాటలు విన్న నేతన్న మళ్లీ మోసపో యాడు. గతంలోనూ రెండు నెలల జీవన భృతితో పాటు రెండు వందలు యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. విరామ సమయంలో మత్స్య కారులకు ఇచ్చే విధంగా వర్షా కాలంలో రెండు నెలల పాటు పనులు కోల్పోయిన చేనేత కార్మికులకు నెలకు రూ.4 చొప్పున ఒక్కో కార్మికునికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇన్నిసార్లు మాటిచ్చినా ఏనాడూ నిలబెట్టుకోలేదు.
ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చేనేత కార్మికుల సమస్యలు తనకు తెలుసని, వారికి అండగా ఉంటానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక నేతన్నను మరిచిపోయారు. నేతన్నలు కూలీలుగా మారుతున్నారు.
– ఆకాశపు కృష్ణారావు, సోమప్పకాలనీ,
కాగువాడ గ్రామం, పాతపట్నం.
కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఇచ్చిన మాట ప్రకారం 200 విద్యుత్ యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇచ్చి, అర్హులైన వారికి గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను అమలు చేసి ఆర్థి కంగా ఆదుకోవాలి. చేనేత మగ్గాలు కలిగిన చేనేత కుటుంబాలకు రూ.5 లక్షలు వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ ఇవ్వడంతో పాటు, 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ రెట్టింపు చేయాలి.
– దాసి నారాయణరావు, సోమప్పకాలనీ, కాగువాడ గ్రామం, పాతపట్నం
సంక్రాంతి పండగకు తమ సొంత గ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప
సంక్రాంతి పండగకు తమ సొంత గ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప
సంక్రాంతి పండగకు తమ సొంత గ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప
సంక్రాంతి పండగకు తమ సొంత గ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప


