శ్రీకాకుళం అర్బన్: ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్ల జారీలో ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయన్న నెపంతో జిల్లాలో పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లలో స్కూల్ ప్రిన్సిపాల్ సంతకాలు, స్టాంపులు ఉండాల్సిందేనన్న నిబంధనలు పెట్టి విద్యార్థులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి చేయడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సూచనలు జరీ చేసిందని గుర్తు చేశారు. ఎక్కడైనా హాల్ టికెట్ల జారీ పేరుతో యాజమాన్యాలు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
తుప్పల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని జరజాం రోడ్డు పక్కన తుప్పల్లో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్సై నక్క కృష్ణారావు, పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 30 ఉండవచ్చని భావిస్తున్నారు. ఇతను కొంతకాలంగా ఈ ప్రాంతంలోనే తిరిగే వాడని స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యం, ఆకలి వంటి సమస్యలతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నా రు. వివరాలు తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలని పోలీసులు సూచించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు 08942 –281833, 63099 90853 నంబర్లకు సమాచా రం తెలియజేయాలని కోరారు.
లారీని ఢీకొట్టిన కారు
● ఇద్దరు మహిళలకు గాయాలు
నరసన్నపేట: జమ్ము ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలికి చెందిన పి.సునీత, పి.పద్మలకు తీవ్ర గాయాలయ్యాయి. ముందు వెళ్తున్న లారీని వెనకనుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. తాపీమేసీ్త్ర పి.గణపతి కాలికి గాయం కావడంతో శ్రీకాకుళంలో చికిత్స చేసిన అనంతరం తిరిగి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న ఎన్‌హెచ్ అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఫీడర్ అంబులెన్సులో ప్రసవం
కంచిలి: మండలంలోని కుంబరినౌగాం గ్రామానికి చెందిన సునీత బెహరా అనే గర్భిణికి గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న ఎం.ఎస్.పల్లి పీహెచ్‌సి ఫీడర్ అంబులెన్స్ ఈఎంటీ అజయ్ వెంటనే గ్రామానికి వెళ్లారు. ఫీడర్ అంబులెన్సులో సునీతను తీసుకొస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే ప్రసవం చేయించడంతో మగబిడ్డ జన్మించాడు. అనంతరం తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించిన ఈఎంటీ అజయ్‌ను గ్రామస్తులు అభినందించారు.
మానవ అక్రమ రవాణా నిరోధించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యాయసేవా సదన్‌లో పోక్సో చట్టం, వెట్టి చాకిరి నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిషేధ చట్టంపై స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, మున్సిపల్ కమిషనర్ పి.వి.ఆర్.పి.ప్రసాదరావు, డిప్యూటీ లేబర్ కమిషనర్ కె.అజయ్ కార్తికేయ, డిప్యూ టీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, బాలల సంక్షేమ అధికారులు శ్రీలక్ష్మి, కె.వి.రమణ పాల్గొన్నారు.
హాల్‌టికెట్ల పేరిట విద్యార్థులను వేధించొద్దు
హాల్‌టికెట్ల పేరిట విద్యార్థులను వేధించొద్దు
హాల్‌టికెట్ల పేరిట విద్యార్థులను వేధించొద్దు