ప్రీమియం కట్టినా పంటల బీమా గల్లంతే! | - | Sakshi
Sakshi News home page

ప్రీమియం కట్టినా పంటల బీమా గల్లంతే!

Nov 29 2026 12:58 PM | Updated on Nov 29 2026 12:58 PM

అనంతపురం అగ్రికల్చర్‌: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పంటల బీమా పథకాలు ప్రహసనంగా మారాయి. గత రెండున్నరేళ్లుగా అటు వాతావరణ బీమా ఇటు ఫసల్‌బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పైసా కూడా పరిహారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. రైతు బాగోగులే లక్ష్యంగా గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉచితంగా పంటల బీమా పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. రైతులపై ప్రీమియం భారం మోపకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతో పాటు ఏటా క్రమం తప్పకుండా నిబంధనల మేరకు పరిహారం ఇచ్చి ఆదుకుంది. అయితే చంద్రబాబు 2024లో అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసి... ప్రీమియం కట్టాల్సిందేనని రైతులపై పెనుభారం మోపారు. ఇలా ప్రీమియం కట్టినా పరిహారం ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.

‘అనంత’లో 91,753 హెక్టార్లు గల్లంతు

ఖరీఫ్‌లో వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, అరటి, చీనీ, దానిమ్మ, ద్రాక్ష పంటలకు అమలు చేయగా.. ఫసల్‌బీమా కింద గ్రామం యూనిట్‌గా కందితో పాటు వరి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండుమిరప.. ఇలా మొత్తంగా 12 పంటలను నోటిఫై చేశారు. వ్యవసాయ పంటలకు 2 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం మేర రైతుల నుంచి ప్రీమియం వసూలు చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2.25 లక్షల మంది రైతులు 3,70,371 హెక్టార్ల పంటలకు తమ వాటా కింద రూ.52 కోట్ల మేర ప్రీమియం చెల్లించారు. అయితే పంటల బీమా కంపెనీ నమోదు చేసిన డేటా.. అలాగే వ్యవసాయశాఖ సమర్పించిన ఈ–క్రాప్‌ జాబితా మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రీమియం కట్టినా 91,753 హెక్టార్ల పంటలు అనర్హత జాబితాలోకి చేర్చారు. దాదాపు 70 వేల మంది రైతులకు బీమా కింద పరిహారం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

శ్రీసత్యసాయి జిల్లాలో మరీ దారుణం

శ్రీసత్యసాయి జిల్లాలో పంటల బీమా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా గత ఖరీఫ్‌లో అటు వాతావరణ బీమా ఇటు ఫసల్‌బీమా కింద 1.50 లక్షల మందికి పైగా రైతులు 2,32,433 హెక్టార్ల పంటలకు బీమా కింద రూ.35 కోట్లు మేర ప్రీమియం చెల్లించారు. అయితే ఈ–క్రాప్‌ డేటా పరిశీలిస్తే... ఏకంగా 1,36,892 హెక్టార్లు అనర్హత జాబితాలోకి చేరిపోయింది. ఇక్కడ ఏకంగా 58.9 శాతం మంది రైతులకు బీమా కింద పరిహారం వస్తే పరిస్థితి లేదని అంచనా వేస్తున్నారు. రైతులకు తీరని అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నందున జాబితాలు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెల 30లోపు నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేసినట్లు వ్యవసాయ, ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి.

అనంతపురం జిల్లాలో 91,753 హెక్టార్లు అనర్హత జాబితాలోకి

శ్రీసత్యసాయి జిల్లాలోనూ 1,36,892 హెక్టార్లకు అంతే..

ఇన్సూరెన్స్‌ పోర్టల్‌, ఈ–పంట జాబితా మధ్య భారీ వ్యత్యాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement