రాప్తాడు ఘటన బాధితురాలికి ఆర్థికసాయం | - | Sakshi
Sakshi News home page

రాప్తాడు ఘటన బాధితురాలికి ఆర్థికసాయం

Nov 29 2026 12:58 PM | Updated on Nov 29 2026 12:58 PM

ధర్మవరం అర్బన్‌: రాప్తాడు ఘటన బాధితురాలికి యూటీఎఫ్‌ నాయకులు ఆర్థికసాయం అందించారు. గత నెల 31న అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్మాది రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, కృష్ణా, గుంటూరు ఉభయ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి హనుమంతరావుతో కలిసి బాలికను పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. అనంతరం బాలికకు ధైర్యం చెప్పి విద్యాభివృద్ధి కోసం అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు సురేష్‌కుమార్‌, లక్ష్మీరాజా, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

హిందూపురం(చిలమత్తూరు): హిందూపురం రూరల్‌ మండలం దేవరపల్లి కాలనీలో విజయలక్ష్మి(58) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయలక్ష్మి దేవరపల్లి కాలనీలోని ఇంటిలో చిన్న దుకాణం నిర్వహిస్తూ ఉండేది. శనివారం పగలు అంగడికి వెళ్లిన స్థానికులు ఆమె అచేతనంగా ఉండటాన్ని గమనించి కుమారుడికి సమాచారమిచ్చారు. అతడు ఇంటికి చేరుకొని తన తల్లి మృతి చెందినట్టు గుర్తించి.. పోలీసులకు విషయాన్ని చెప్పడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా మహిళ మెడలో చైను, చెవిలో కమ్మలు లేకపోవడంతో ఎవరో దాడి చేసి చంపి బంగారం లాక్కెళ్లి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మహిళ మెడపై గాయాలుండడంతో కేసు నమోదు చేసి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ మునీర్‌ అహ్మద్‌ తెలిపారు.

విద్యుత్‌ స్తంభాన్ని

ఢీకొన్న కారు

ముదిగుబ్బ: మండల పరిధిలోని తప్పెటవారిపల్లి సమీపంలో శనివారం కారు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పులివెందులకు చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యుత్‌శాఖ ఏఈ చంద్రానాయక్‌ నష్టాన్ని పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement