సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Nov 29 2026 12:58 PM | Updated on Nov 29 2026 12:58 PM

అనంతపురం: చిత్తూరులోని కేవీపీఎన్‌ కళాశాలలో డిసెంబర్‌ 12, 13, 14 తేదీల్లో జరుగనున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ క్రీడాపోటీల్లో పాల్గొనే అనంతపురం జిల్లా మహిళల జట్టును శనివారం ఎస్కే విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో ఎంపిక చేశారు. అనంతపురం జిల్లా సాఫ్ట్‌బాల్‌ సంఘం అధ్యక్షురాలు డి.గాయత్రి, కార్యదర్శి సి.గంగమ్మ తెలిపారు. ఈ ఎంపిక పోటీలకు మొత్తం 60 మంది క్రీడాకారిణులు హాజరు కాగా, వారిలో 18 మందితో కూడిన ప్రధాన జట్టును, నలుగురిని అదనపు క్రీడాకారిణులను ఎంపిక చేసినట్టు వెల్లడించారు.

ఎంపికై న మహిళల జట్టు వివరాలు..

టి.లక్ష్మి – ఎం.కొండాపురం, వై.సాయిరిషిత – కదిరి, బి.లావణ్య – కదిరి, టి.భవాని – ముదిగుబ్బ, డి.ప్రసంతి – అనంతపురం, వై.ఖ్యాతి కళ్యాణ్‌ – అనంతపురం, పి.రిషిత – కనగానపల్లి, సి.కీర్తన – నూతిమడుగు, యు.మైథిలి – దాడితోట, డి.షబనా – నూతిమడుగు, టి.సుకన్య – నరసాంపల్లి, ఎం.భాసంతి – అనంతపురం, బి.మధులిత – రాప్తాడు, కె.ప్రవస్య – నూతిమడుగు, ఎం.రిషిత – అనంతపురం, డి.పూజితాంజలి – అనంతపురం, డి.రాగనందిని – అనంతపురం, బి.కుందన – దాడితోట, అదనపు క్రీడాకారిణులుగా: ఆర్‌.రజని – కనగానపల్లి, జె.శ్రావణి – కోగిర, టి.శశిరేఖ – నూతిమడుగు, రొద్దం నుంచి బి.శ్రీజ్యోతిలను ఎంపిక చేశారు. క్రీడాకారిణుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి సి.వెంకటేశులు, పీడీలు రమేష్‌, ప్రభాకర్‌, సంజీవ, చంద్ర, సీనియర్‌ క్రీడాకారులు సింహాద్రి, వినోద్‌, లోకేష్‌, సాయి వెంకట్‌ పర్యవేక్షించినట్టు అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement