మడకశిరలో జనసేనకు ఝలక్‌ | - | Sakshi
Sakshi News home page

మడకశిరలో జనసేనకు ఝలక్‌

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

మడకశిర: స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న జనసేనకు మడకశిరలో షాక్‌ తగిలింది. కూటమి పొత్తులో భాగంగా మడకశిర చైర్మన్‌ స్థానాన్ని జనసేనకు కేటాయించగా.. ఆ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసులు నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే సోమవారం పరిశీలనలో ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. చైర్మన్‌ స్థానానికి 13, వార్డులకు 74 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని మున్సిపల్‌ కమిషనర్‌ మురళీధర్‌తో పాటు ఎన్నికల అధికారులు పరిశీలించారు. చైర్మన్‌ స్థానానికి దాఖలైన 13 నామినేషన్లలో 9 నామినేషన్లను ఓకే చేశారు. జనసేన తరఫున వేసిన 4 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. జనసేన అధికారిక అభ్యర్థి శ్రీనివాసులు వేసిన రెండు సెట్ల నామినేషన్లు, జనసేన తరఫున డమ్మీ అభ్యర్థులుగా సంజీవరత్న, రామకృష్ణ వేసిన నామినేషన్లను కూడా అధికారులు తిరస్కరించారు. వారి నామినేషన్ల పత్రాల్లో కొన్ని కాలమ్‌లను భర్తీ చేయకపోవడంతో తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి భాస్కర్‌ తెలిపారు.

పొత్తు ధర్మానికి టీడీపీ నాయకుల తూట్లు

జనసేనకు చైర్మన్‌ స్థానం కేటాయించడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు జనసేన అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని ప్లాన్‌ చేశారు. నామినేషన్ల పరిశీలన సమయంలో జనసేన అభ్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు తెలిపారు. కాలమ్స్‌ అన్ని పూరించలేదని, అందువల్ల వారి నామినేషన్లను తిరస్కరించాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ నాయకుల అభ్యంతరాలు సరైనవేనని భావించిన అధికారులు... జనసేన అభ్యర్థి శ్రీనివాసులు, డమ్మీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.

హైకోర్టులో సవాల్‌ చేస్తాం

జనసేన అభ్యర్థుల నామినేషన్‌ తిరస్కరణపై ఆ పార్టీ లీగల్‌ టీం సభ్యుడు దాసరి వెంకట రాజ్‌కమల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు అన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ అధికారులు తిరస్కరించారని, దీన్ని హైకోర్టులో సవాల్‌ చేస్తామని ఆయన వెల్లడించారు. నామినేషన్ల తిరస్కరణలో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఏది ఏమైనా జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారని స్పష్టం చేశారు.

చైర్మన్‌ అభ్యర్థి శ్రీనివాసులుతో పాటు

డమ్మీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

జనసేన అభ్యర్థుల నామినేషన్‌పై

టీడీపీ నాయకుల అభ్యంతరం

కూటమి పొత్తు ధర్మానికి

తూట్లు పొడిచిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement