ప్రశాంతి నిలయం: విజయదశమి జిల్లా ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, అష్టఐశ్వర్యాలు నింపాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ మేరకు జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్య సాధనలో అందరికీ ఆ జగన్మాత విజయాలను ప్రాప్తింపజేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పోలీస్ కార్యాలయంలో ఆయుధపూజ
పుట్టపర్తి టౌన్: రోజూ కేసుల నమోదు, విచారణలు, బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యే పోలీసులు సోమవారం భక్తి పారవశ్యంలో తరించారు. పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన దుర్గ పూజల్లో పోలీసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు, వాహనాలకు ఎస్పీ సతీష్‌కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎీస్పీ మాట్లాడుతూ విజయాలకు చిహ్నమైన విజయదశమి అందరికి విజయం చేకూర్చాలని, సుఖశాంతులు వెల్లివిరియాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఆనందోత్సహాల నడుమ పండుగను జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకితా సురానా, ఏఓ వేణుగోపాల్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు ఎస్బీ సీఐ రాఘవన్, ఆర్‌ఐలు వలీ, మహేష్, ఉమామహేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు ప్రదీప్ సింగ్‌తోపాటు డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
వాటర్ వర్కర్స్‌కు వేతనాలు
తక్షణం విడుదల చేయాలి
● సమ్మె చేస్తున్నా
పట్టించుకోకపోవడం బాధాకరం
● విలేకరుల సమావేశంలో
సీఐటీయూ నేత ఓబులు
పుట్టపర్తి టౌన్: పెండింగ్‌లో ఉన్న వాటర్ వర్కర్స్ జీతాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు డిమాండ్ చేశారు. సోమవారం పుట్టపర్తి పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాటర్ వర్కర్స్‌కు జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. వాటర్ వర్కర్స్ తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు కోసం నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోడం బాధాకరమన్నారు. కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని తక్షణం పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలానే కార్మికులతో చర్చలు జరిపి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పైపల్లి గంగాధర్, అంకె ముత్యాలు పాల్గొన్నారు.
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ధర్మవరం రూరల్: పట్టణంలోని పోతుకుంట రైల్వే గేటు వద్ద సోమవారం 45 సంవత్సరాల పైబడిన గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక రైలు నుంచి జారి పడ్డాడా? అనే విషయం తెలియాల్సి వుంది. మృతుడి కాలర్‌పై రజాక్ టైలర్ అనే లేబుల్ వున్నట్లు వారు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిచిన వారు 92475 75615కు సమాచారం ఇవ్వాలన్నారు.


