● చిన్న కారణాలతో తిరస్కరించడంపై
వైఎస్సార్‌సీపీ అభ్యంతరం
హిందూపురం టౌన్: వైఎస్సార్ సీపీ 11వ వార్డు అభ్యర్థి షేక్ షాహీన్ నామినేషన్ తిరస్కరణపై వివాదం నెలకొంది. సోమవారం పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టారు. చిన్న చిన్న కారణాలను సాకుగా చూపుతూ నామినేషన్‌ను తిరస్కరించడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్‌లోని లోపాలను సరిచూసి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, చిన్న కారణాలతో తిరస్కరించడం తగదని అభ్యర్థితో పాటు, వైఎస్సార్ సీపీ లీగల్ టీమ్ సభ్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక నామినేషన్ పరిశీలన కేంద్రానికి చేరుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అనుమతించేది లేదు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఆమె మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడారు. చిన్న కారణాలను చూపుతూ నామినేషన్‌ను తిరస్కరించడం సరికాదన్నారు. నామినేషన్ తిరస్కరణకు సంబంధించి నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నామినేషన్‌ను మరోమారు పరిశీలించాలని.. లీగల్ విభాగం సభ్యులు రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. అయినప్పటికీ 11వ వార్డు అభ్యర్థి షాహిన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.


