వద్దు బాబూ...మా కొద్దు! | - | Sakshi
Sakshi News home page

వద్దు బాబూ...మా కొద్దు!

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

హిందూపురం (చిలమత్తూరు): మున్సిపల్‌ పోరులో టికెట్ల కోసం అందరూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే...హిందూపురంలో పరిస్థితి తలకిందులైంది. హిందూపురం చైర్మన్‌ సీటును బీసీలకు రిజర్వ్‌ చేయగా..ఆయా వర్గాల్లో టీడీపీ ముఖ్య నేతలెవరూ పోటీకి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్‌ ఖరారు కానంతవరకూ తాము పోటీ చేస్తామంటే తామంటూ సామాజిక మాధ్యమాల్లో, నేతల వద్ద గొప్పలు చెప్పిన నేతలంతా రిజర్వేషన్‌ ఖరారు కాగానే జారుకున్నారు. చైర్మన్‌ పోటీ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆయన వ్యక్తిగత కార్యదర్శులు (పీఏలు) తలలు పట్టుకుంటున్నారనే చర్చ సాగుతోంది. ఒకవేళ ఎవరికో ఒకరికి సీటు కేటాయించినా ఫుల్‌ జోష్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీని ఢీకొట్టడం సాధ్యమా..? అని లోలోన మదన పడుతున్నారు. నోటిఫికేషన్‌ కూడా వచ్చేయడం, శుక్రవారం నుంచే నామినేషన్‌ స్వీకరణ కూడా ప్రారంభం కానుండగా... చైర్మన్‌ అభ్యర్థి ఎవరన్నది తేలకపోవడంతో టీడీపీలోని ముఖ్య నేతలే తలలుపట్టుకుంటున్నారు.

పార్టీపై వ్యతిరేకత, నేతల అవినీతే కారణమా..?

టీడీపీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనుకంజ వేస్తుండటానికి కారణం టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, నేతల మితిమీరిన అవినీతి కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండున్నరేళ్లు కేవలం సంపాదన మీదే దృష్టి పెట్టిన టీడీపీ నాయకులు... అభివృద్ధి పనుల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. మట్టి, ఇసుక అక్రమ రవాణా, భూకబ్జాలతో చెలరేగిపోయారు. అలాగే అభివృద్ధి పనులు దక్కించుకుని బినామీ కంపెనీలకు పనులు అప్పగించారు. నాసిరకం పనులతో ప్రజలకు చుక్కలు చూపించారు. కనీసం తాగునీరు సరఫరా చేయలేని దుస్థితికి రావడంతో ప్రజల్లో టీడీపీపై, ఆ పార్టీ నేతలపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అంతేకాకుండా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురంలో జరిగిన దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు వంటి భయానక పరిస్థితులను ప్రజలు మరచిపోలేకపోతున్నారు,

బీసీ, మైనార్టీ నేతలే లక్ష్యంగా వేధింపులు

వైఎస్సార్‌సీపీ హయాంలో హిందూపురంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీసింది. ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించారు. కానీ ఈ రెండున్నరేళ్లలో పరిస్థితి దారుణంగా తయారైంది. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పడం, వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడటం, అక్రమ అరెస్ట్‌లతో టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాజకీయ కక్షతో వైఎస్సార్‌సీపీ నేతలైన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన లోకేష్‌, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నవీన్‌లను ఓ కేసు విషయంలో బేడీలు వేసి నడిరోడ్డుపై నడిపించుకుని తీసుకువెళ్లడం, జైలుకు పంపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు బీసీ, ఎస్సీ లీడర్లను వేధించారని ఆయా వర్గాల్లో చర్చ జరిగింది. ఈ ఘటన తర్వాత బీసీలు, ఎస్సీలు హిందూపురంలో టీడీపీ కార్యక్రమాలకు దూరమయ్యారు.

వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి

అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో టీడీపీ నేతలు దారుణంగా వ్యవహరించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ దుర్మార్గాలకు పాల్పడ్డారు. వీటిని వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి ప్రశ్నించారన్న కారణంతో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. ఈ సంఘటనతో ‘పురం’ ప్రజల మనసుల్లో టీడీపీ అరాచక శక్తి అనే భావన ఏర్పడింది. స్థానికేతరులను పీఏలుగా నియమించడంతో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోశారనే చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌ సీపీ కార్యాలయంపై దాడి తర్వాత వేలాది మంది పోలీసులను మోహరించడం వంటి చర్యలతో పట్టణ ప్రజల్లో భయం నెలకొంది. ఇలాంటి అరాచకాలకు చరమగీతం పాడాలనే ఆలోచన ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలోనే టీడీపీ తరఫున బరిలో నిలిచేందుకు తమ్ముళ్లు భయపడుతున్నారు.

హిందూపురం చైర్మన్‌ పోటీకి ముందుకురాని ‘తమ్ముళ్లు’

ప్రజల్లో పార్టీకి వ్యతిరేకత, నేతల అవినీతి, అరాచకాలతో

ఉత్సాహం చూపని వైనం

ఇప్పటికే నిర్ణయించిన నేతలంతా పోటీకి దూరమంటూ సమాచారం

దిక్కుతోచని స్థితిలో బాలకృష్ణ పీఏలు, టీడీపీ సీనియర్‌ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement