జ్ఞానయజ్ఞం.. ఆధ్యాత్మిక శోభితం | - | Sakshi
Sakshi News home page

జ్ఞానయజ్ఞం.. ఆధ్యాత్మిక శోభితం

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

ప్రశాంతి నిలయం: విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రారంభమైన వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం గురువారం రెండో రోజు కొనసాగింది. పండితుల వేదపఠనం నడుమ సాగిన యజ్ఞంలో వేలాది భక్తులు పాల్గొన్నారు. పండితులతో కలిసి భక్తులు కూడా వేదమంత్రాలు పఠిస్తూ ఆధ్యాత్మిక పరవశం చెందారు. సాయంత్రం వేడుకల్లో భాగంగా ప్రశాంతి విద్వాన్‌ మహాసభ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ వేదాంతి డాక్టర్‌ శ్యామలానంద ప్రసాద్‌ ఆధ్మాత్మి చింతన గురించి వివరించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం

అనంతపురం అర్బన్‌: ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెన్షన్‌, జీపీఎఫ్‌ ఆదాలత్‌ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ శాంతిప్రియ పేర్కొన్నారు. రెండోరోజు గురువారం పెన్షన్‌, జీపీఎఫ్‌ అదాలత్‌ను ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యల పరిష్కారం అంశంపై నిర్వహించారు. కార్యక్రమానికి అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాష్‌కుమార్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ మాట్లాడుతూ ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలను ఏ దశలోనూ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సంబంధిత అధికారులు సత్వరం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రెండు రోజుల అదాలత్‌లో 75 పెన్షన్‌ ఆథరైజేషన్లు, 111 జీపీఎఫ్‌ ఆథరైజేషన్లు జారీ చేశామన్నారు. అదే విధంగా పెన్షన్‌, జీపీఎఫ్‌, సీఎఫ్‌ఎంఎఫ్‌కు సంబంధించి 160 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.

ఏడాదిన్నర తర్వాత

ఎన్‌హెచ్‌–44 విస్తరణ పనులు

ప్రశాంతి నిలయం: జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారి–44 ఆరులేన్లుగా విస్తరించే పనులను ఏడాదిన్నర తర్వాత చేపట్టనున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా పరిధిలో 77 కి.మీ మేర విస్తరించిన రహదారిని ఆరులేన్లుగా మార్చేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందన్నారు. ప్రస్తుతం డీపీఆర్‌ దశలో ఉందని, ఇందుకు ఏడాదిన్నర సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. స్థానికులకు ఇబ్బందులు కలగకుండా యాక్సిస్‌ రోడ్డు, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్‌లు నిర్మిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement