కన్నీటి సేద్యం | - | Sakshi
Sakshi News home page

కన్నీటి సేద్యం

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

పేరూరు సమీపంలో ఆముదం పంటకు

ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్న రైతు

వరుణుడు తొలకర్లతో పలకరించగా మురిసిపోయిన రైతన్నలు ఉత్సాహంగా విత్తనం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత

వాన జాడే కరువుకావడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పుడప్పుడే భూమిని చీల్చుకుని మొలకెత్తిన పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

ఈ క్రమంలోనే రామగిరి మండలం పేరూరు సమీపంలో ఆముదం, కంది పంటలు ఎండుతుండడంతో రైతులు ఇలా ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువెళ్లి మొక్కలకు పెడుతూ కన్నీటి సేద్యం చేస్తున్నారు. రైతన్న కష్టం పండుతుందా...

పంట ఎండుతుందా.. ఆపై వాడికే తెలియాలి. – రామగిరి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement