కలుషిత నీరు తాగి గొర్రెల మృతి | - | Sakshi
Sakshi News home page

కలుషిత నీరు తాగి గొర్రెల మృతి

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

కదిరి అర్బన్‌: ప్రమాదవశాత్తు యూరియా కలిపిన నీరు తాగి 40 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. కదిరి మండలం మీటేనాయక్‌ తండా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొజ్జేనాయక్‌ జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తన జీవాలను మేపు కోసమని గ్రామ శివారులోని పొలాల్లోకి తోలుకెళ్లాడు. మధ్యాహ్న సమయంలో దాహం వేసిన గొర్రెలను తిరుపాల్‌నాయక్‌ పొలంలో నీటిని తాపేందుకు వదిలాడు. అయితే అప్పటికే యూరియా కలిపిన నీరు పైపుల్లో ఉండడంతో ఆ నీరు తాగి 40 గొర్రెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న పశువైద్యాధికారి సునీత అక్కడకు చేరుకుని గొర్రెల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనతో రూ. 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement