బత్తలపల్లి: శుభకార్యానికి వెళ్లి బ్యాగు చూసుకోగా, అందులో ఉన్న
బంగారు గొలుసు కనిపించలేదని బాధితులు నాగమోహన్, భూమిక దంపతులు ఆవేదన చెందారు. వివరాలు.. ముద్దనపల్లికి చెందిన నాగమోహన్, భూమిక దంపతులు నార్పల మండలం గొల్లపల్లికి ఓ శుభకార్యానికి వెళ్లేందుకు బత్తలపల్లికి వచ్చారు. తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సులో వెళ్లారు. అక్కడికెళ్లిన తర్వాత బ్యాగులో ఉన్న మూడున్నర తులాల బంగారు నెక్లెస్ కనిపించలేదు. అయితే అదే బ్యాగులో ఉన్న జత కమ్మలు, చిన్నపాటి గొలుసు ఉందని బాధితులు తెలిపారు. అనంతరం బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.


