పేలుడు గురించి తెలిసీ ఎందుకు చెప్పలేదు.! | - | Sakshi
Sakshi News home page

పేలుడు గురించి తెలిసీ ఎందుకు చెప్పలేదు.!

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

కదిరి అర్బన్‌: మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈక్రమంలోనే పేలుళ్లు జరిగిన ఇంట్లో నివాసం ఉన్న ఇద్దరిని బుధవారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. పేలుడు పదార్థాలకు అనుమతులున్నాయా..? లైసెన్స్‌ ఎవరిచ్చారు..వాటిని ఇంట్లో ఎందుకు నిల్వ చేశారు, అసలు ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎంత మంది ఉన్నారు... ప్రమాదం గురించి తెలిసి ఇరుగూపొరుగుకు చెప్పకుండా ఎందుకు పరారయ్యారు..? తదితర విషయాలను ప్రస్తావిస్తూ విచారణ చేస్తున్నట్లు సమాచారం.

కుమ్మరవాండ్లపల్లి ఘటనపై విచారణ ముమ్మరం

నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న

పోలీసులు!

Advertisement
 
Advertisement
Advertisement