పంచాయతీ ఓటర్లు 11,35,917 | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఓటర్లు 11,35,917

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

● డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా విడుదల

పుట్టపర్తి అర్బన్‌: జిల్లా పంచాయతీ ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 32 మండలాలు ఉండగా... 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లోని వార్డుల వారీగా డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాను జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ ) సమత గురువారం విడుదల చేశారు. ఏపీ పంచాయతీ రాజ్‌ చట్టం–1994 నిబంధనల మేరకు 2026 ఏప్రిల్‌ 15వ తేదీ నాటికి వరకూ ఆయా పంచాయతీలో ఉన్న ఓటర్లతో జాబితా రూపొందించినట్లు వెల్లడించారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే 2,318 మంది ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. పంచాయతీ ఓటరు జాబితాను ఆయా గ్రామ పంచాయతీల కార్యాలయాల్లో ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement