ప్రశాంతి నిలయం: సత్యసాయి మహాసమాధి సన్నిధిలో కేరళ నూతన సంవత్సర వేడుకలు మూడో రోజు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి మహాసమాధి, సాయికుల్వంత్ సభా మందిరాన్ని కేరళ సంప్రదాయరీతిలో అలంకరించారు.
వేడుకలనుద్దేశించి అశ్వతీ సురేష్ ప్రసంగించారు. అనంతరం హృదయ హారం పేరుతో కేరళకు చెందిన సత్యసాయి యూత్ సంగీత విభావరి నిర్వహించారు. సాయంత్రం సప్తవీణ పేరుతో సుశీల బృందం నిర్వహించిన వీణావాయిద్య కచేరీ అలరించింది. అనంతరం విషు వేడుకల ప్రాశస్థ్యాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ జి .శంకర్ వివరించారు.


