రసాభాసగా మార్కెట్‌ టెండర్ల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

రసాభాసగా మార్కెట్‌ టెండర్ల నిర్వహణ

Apr 16 2026 12:05 PM | Updated on Apr 16 2026 12:05 PM

గుడిబండ: స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో వారపు పశువుల సంత, దినసరి బస్టాండ్‌, కూరగాయల మార్కెట్‌పై సుంకం వసూలుకు బుధవారం నిర్వహించిన వేలం ప్రక్రియ రసాభాసగా జరిగింది. ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ రామారావు, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజునాయక్‌ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ ఆవరణంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. 12 మంది పాల్గొన్నారు. వేలం ప్రక్రియ మొదలు పెట్టగానే కొందరు కూటమి నాయకులు తమకే టెండర్లు దక్కాలని అధికారులపై బెదిరింపులకు దిగారు. ఆ సమయంలో వేలం పాడేందుకు వచ్చిన 12 మంది కల్పించుకునే ప్రయత్నం చేయడంతో వారిపై దౌర్జన్యానికి దిగారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీయడంతో సీఐ రాజ్‌కుమార్‌, ఎస్‌ఐ రమేష్‌బాబు కలుగుజేసుకుని సర్దిచెప్పారు. అనంతరం నిర్వహించిన వేలం ప్రక్రియలో వారపు పశువుల సంత రూ.35.6 లక్షలు, కూరగాయల మార్కెట్‌ రూ.2లక్షలు, దినసరి బస్టాండ్‌ రూ.1.71 లక్షలకు కూటమి నాయకులే దక్కించుకున్నారు.

టెండర్లు తమకే కావాలంటూ కూటమి నాయకుల దౌర్జన్యం

Advertisement
 
Advertisement
Advertisement