వైఎస్సార్‌సీపీ కార్యకర్త టమాట కట్టెలకు నిప్పు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్త టమాట కట్టెలకు నిప్పు

Apr 16 2026 12:05 PM | Updated on Apr 16 2026 12:05 PM

చిలమత్తూరు: మండలంలోని ఆదేపల్లి తండాకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగేనాయక్‌కు చెందిన 3 వేల టమాట కట్టెలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో రూ.60 వేలు వరకూ నష్టం వాటిల్లినట్టు బాధితుడు వాపోయాడు. టీడీపీకి చెందిన వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

మడకశిర విద్యుత్‌ శాఖ డీఈఈ సస్పెన్షన్‌

మడకశిర: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మడకశిర విద్యుత్‌ శాఖ డీఈఈ ఎం.రఘును సస్పెండ్‌ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్‌ పరికరాల దుర్వినియోగం, పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల రవాణాకు అధికారిక వాహనాన్ని వినియోగించుకోక పోవడం, రైతులతో దురుసు ప్రవర్తన, వ్యవసాయ సర్వీసు దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వివిధ ప్రదేశాల్లో విద్యుత్‌ లైన్ల అంచనాలు, అనుమతి లేకుండా మార్చడం తదితర అంశాలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement