పేలుడు జరిగిన ఇంటికి సమీపంలోనే నివాసం ఉంటున్నాం. ఆ ఇంట్లో మంటలు వ్యాపిస్తుండడంతో ఆర్పేందుకు బిందెలతో నీళ్లు ఇచ్చాను. ఇంతలోనే భారీశబ్ధంతో పేలుడు సంభవించింది. నా ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది. నాకు స్వల్ప గాయాలయ్యాయి. భయంకరమైన పేలుడుతో భీతిల్లిపోయాం. పేలుడు జరిగిన ఇంట్లో వారు నాలుగురోజులకోసారి వ్యానులో వచ్చి వెళ్తుండేవారు. ఏదో మైనింగ్ పని చేసుకుంటున్నారని అనుకున్నాం. ఇలా పేలుడు పదార్థాలు నిల్వ చేస్తుంటారని ఊహించలేకపోయాం. – పార్వతమ్మ, కుమ్మరవాండ్లపల్లి


