మురళీ త్యాగం వెలకట్టలేనిది | - | Sakshi
Sakshi News home page

మురళీ త్యాగం వెలకట్టలేనిది

Apr 15 2026 8:56 AM | Updated on Apr 15 2026 8:56 AM

గోరంట్ల: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్‌ మురళీనాయక్‌ త్యాగం మరువలేనిదని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ కొనియాడారు. గత ఏడాది భారత్‌ – పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో మురళీనాయక్‌ అమరులయ్యారు. మండల పరిధిలోని కల్లితండా గ్రామంలో మంగళవారం మురళీనాయక్‌ ప్రథమ వర్ధంతి జరిగింది. కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పాల్గొని మురళీనాయక్‌ సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మురళీనాయక్‌ వంటి వీరులు జిల్లాకే గర్వకారణమన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్‌ స్ఫూర్తిని యువత కొనసాగించాలన్నారు. అనంతరం జిల్లా అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు నివాళులర్పించార. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్‌ మధునాయక్‌, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం..

అమర జవాన్‌ మురళీనాయక్‌ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం మండల పరిధిలోని కల్లి తండా గ్రామంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది.

నేత్రదానంతో

ఇద్దరికి చూపు

ధర్మవరం అర్బన్‌: మరణానంతరం తన నేత్ర దానంతో మరో ఇద్దరికి కంటి చూపునుప్రసాదించారు ధర్మవరంలోని సంజయ్‌నగర్‌కు చెందిన బెళ్లాల కమలమ్మ(86). వయో భారంతో మంగళవారం ఆమె కన్నుమూశారు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకుడు కోళ్లమొరం చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులు అక్కడకు చేరుకుని నేత్రదానంపై మృతురాలి కుటుంబసభ్యులను చైతన్య పరిచారు. అనంతరం వారి ఆమోదంతో కమలమ్మ కంటి కార్నియాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ డాక్టర్‌ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్‌ సెంటర్‌ టెక్నీషియన్‌ రాఘవేంద్రలు సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతురాలి కుమార్తెలు గోవిందమ్మ, లలితమ్మ, ఇంద్ర, అనురాధ, అల్లుళ్లు గంగాధర్‌, శ్రీనివాసులు, నాగేంద్రకు విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement