ద్విచక్ర వాహనాల ఢీ – ముగ్గురికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాల ఢీ – ముగ్గురికి తీవ్ర గాయాలు

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన యువకులు నవీన్‌కుమార్‌, భరత్‌కుమార్‌ వ్యక్తిగత పనిపై మంగళవారం ద్విచక్ర వాహనంలో కదిరికి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. బత్తలపల్లి మండలం రామాపురం సమీపంలోని చిత్రావతి నది బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఓబుళాపురం గ్రామానికి చెందిన రామ్మూర్తి పాత రోడ్డు మీదుగా ద్విచక్రవాహనంపై వస్తూ ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ స్థానికులు వెంటనే 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement