కంటి సమస్యలకు వైద్యం కరువు..
పెనుకొండ: స్థానిక సర్వజనాస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. ఆస్పత్రిలో 11 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 8 మంది మాత్రమే ఉన్నారు. ఉన్న వారే అన్ని విధాలుగా సేవలను అందిస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో కంటికి సంబంధించిన సేవలు ఆసలు నిలిచిపోయాయి. ఇక.. ఆస్పత్రి ముందున్న డ్రైనేజ్ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో రోగుల ఇబ్బందులు పడుతున్నారు. చెత్తా చెదారం, మురుగు నీరు కాలువలో నిలబడటంతో వైద్యం కోసం వచ్చిన వారు రోగాలబారిన పడాల్సిన పరిస్థితి నెలకొంది.


